News February 7, 2025

సీఎం రేవంత్‌పై WEF ప్రశంసల జల్లు

image

TG: CM రేవంత్ రెడ్డిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఆయన దార్శనికత అద్భుతమని పేర్కొంటూ ఓ లేఖ రాసింది. ‘రాష్ట్ర అభివృద్ధికోసం మీ ప్రణాళికలు బాగున్నాయి. దావోస్ సదస్సులో మీరు కీలక భాగస్వామిగా వ్యవహరించారు. రైజింగ్ తెలంగాణ 2050 నినాదం ప్రత్యేకంగా నిలిచింది. 2047 కల్లా హైదరాబాద్‌ను కాలుష్యంలో నెట్ జీరో చేయాలన్న మీ సంకల్పం ప్రశంసనీయం’ అని కొనియాడింది.

Similar News

News April 7, 2026

అక్కడ తొలగించిన ఓటర్లలో 95% ముస్లింలే.. సంచలన నివేదిక

image

WBలోని నందిగ్రామ్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. తొలగించిన ఓటర్లలో 95.5% మంది ముస్లింలే ఉన్నట్లు సబర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. కేంద్రం కుట్రపూరితంగానే ఇలా చేస్తోందని CM మమత ఆరోపిస్తున్నారు. అటు బోగస్ ఓట్లను తొలగించడం రాజ్యాంగబద్ధమని BJP సమర్థించుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో BJP అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమత స్వల్ప తేడాతో ఓడిపోయారు.

News April 7, 2026

పెళ్లి వార్తలపై హీరోయిన్ త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్

image

తనపై వస్తున్న పెళ్లి వార్తలపై హీరోయిన్ త్రిష వ్యంగ్యంగా స్పందించారు. ‘నేను సినిమాలకు గుడ్ బై చెప్పేశానట. ఒక కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్నానట. నిన్నటితో రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలను పెంచుతున్నానట. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి.. లేదంటే ఈ రోజుకి ఈ రూమర్స్ చాలు’ అంటూ ఇన్‌స్టా వేదికగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎద్దేవా చేశారు.

News April 7, 2026

దాడులు చేయబోతున్నాం, జాగ్రత్త.. ఇజ్రాయెల్ వార్నింగ్

image

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఆ దేశంలోని రైల్వే వ్యవస్థపై దాడులు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ రోజు రాత్రి 9 గంటల (ఇరాన్ కాలమానం ప్రకారం) వరకు ప్రజలెవరూ రైళ్లలో ప్రయాణించవద్దని, ట్రాక్స్ దగ్గర ఉండొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ ప్రాంతాల్లో ఉంటే ప్రాణాలు రిస్కులో పడతాయని స్పష్టం చేసింది. కాగా టెహ్రాన్‌తో పాటు IRGC కార్యాలయాలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది.