News March 23, 2024
త్వరలో భారత్‌లోకి వెయిట్‌లాస్ ఇంజెక్షన్స్!
బేరియాట్రిక్ సర్జరీతో పనిలేకుండా ఊబకాయులు బరువు తగ్గేందుకు భారత్‌లో త్వరలో ఇంజెక్షన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యూఎస్‌లో ఆమోదం పొందిన సెమాగ్లుటైడ్, వెగోవీ ఇంజెక్షన్స్ సహా 7 రకాల కొత్త ఔషధాలు క్లినికల్ ట్రయల్స్‌కు రిజిస్టర్ చేసుకున్నాయి. సెమాగ్లుటైడ్, మౌంజారో డయాబెటిక్ కోసం.. వెగోవీ, జెప్‌బౌండ్ వెయిట్‌లాస్ కోసం అందుబాటులోకి రానున్నాయి. వీటితో దాదాపు 20% వరకు బరువు తగ్గొచ్చట.
Similar News
News January 9, 2025
దేశవాళీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ!
టెస్టుల్లో ఫామ్ కోల్పోయిన కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ENGతో జరగనున్న టెస్టు సిరీస్‌కి సన్నద్ధం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏ ప్లేయర్ అయినా ఫామ్ కోల్పోతే దేశవాళీలు ఆడి తమను తాము నిరూపించుకోవాల్సిందే అని కోచ్ గంభీర్ ఇటీవల చెప్పిన నేపథ్యంలో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ENGతో 5టెస్టుల సిరీస్ Juneలో ప్రారంభం కానుంది.
News January 9, 2025
తిరుపతి తొక్కిసలాట: మృతులకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.
News January 9, 2025
కేటీఆర్ క్వాష్ పిటిషన్.. తక్షణ విచారణకు SC నో
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్ట్ అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.