News September 2, 2025

వెయిట్‌లిఫ్టింగ్‌తో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

image

మహిళల ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే వెయిట్‌లిఫ్టింగ్ కూడా వ్యాయామంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది బోన్స్‌ను హెల్తీగా ఉంచి ఎముకల సాంద్రతను పెంచుతుంది. వెయిట్‌లిఫ్టింగ్‌ తర్వాత శరీరంలో ఆక్సిజన్ వినియోగం పెరిగి వర్కవుట్ తర్వాత కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఎండార్ఫిన్‌ హార్మోన్‌ను విడుదల చేసి మీ మానసిక ఆరోగ్య స్థితిని పెంచుతుంది.

Similar News

News September 2, 2025

జియో, ఎయిర్‌టెల్.. మీకూ ఇలా అవుతోందా?

image

జియో, ఎయిర్‌టెల్ సిగ్నల్స్ రాక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఒకప్పటి రోజులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇంట్లో ఏదో ఒకచోటే సిగ్నల్ ఉండటం, అక్కడే నిలబడి ఫోన్ వాడటం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వీడియోలేమో ‘లోడింగ్.. లోడింగ్’ అంటున్నాయి. గ్రామాలను పక్కనపెడితే హైదరాబాద్ వంటి నగరాల్లోనూ నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఫోన్లు కలవడం లేదని చాలామంది వాపోతున్నారు. మీరేమంటారు?

News September 2, 2025

టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు

image

AP: విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వైజాగ్‌కు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పోరేషన్‌ ఏర్పాటుకు అనుగుణమైన పాలసీని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.

News September 2, 2025

అఫ్గాన్ భూకంపం.. 1,400 మందికిపైగా మృతి

image

అఫ్గానిస్థాన్‌లో సంభవించిన <<17587630>>భూకంప ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 1,411 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 3,124 మంది గాయపడ్డారని, 5,412 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత కునార్ ప్రావిన్సులోని ఆసదాబాద్, నుర్గల్, ఛౌకే, వాటాపూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.