News June 13, 2024
సచివాలయానికి చంద్రబాబు.. దారిపొడవునా ఘనస్వాగతం
AP: సీఎం చంద్రబాబు సచివాలయానికి బయల్దేరారు. భారీ హోర్డింగ్‌లు, గజమాలలతో ఆయనకు దారిపొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. సీఎం మార్గమధ్యలో తన కాన్వాయ్‌ని ఆపి వారితో మాట్లాడారు. చంద్రబాబు సరిగ్గా సా.4.41 నిమిషాలకు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Similar News
News December 24, 2024
పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. కేరళ గవర్నర్‌గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరం గవర్నర్‌గా విజయ్‌కుమార్ సింగ్, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ అహ్మద్, మణిపుర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.
News December 24, 2024
టీమ్ ఇండియా సూపర్ విక్టరీ
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. 115 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. 359 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ 243 రన్స్‌కు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ (106) అద్భుత శతకం బాదారు. కానీ మిగతా బ్యాటర్లు ఆమెకు సహకారం అందించలేకపోయారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, ప్రతిక రావల్, సాధు, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
News December 24, 2024
పెండింగ్ ఛలాన్లపై డిస్కౌంట్.. పోలీసులు ఏమన్నారంటే?
వాహనదారులకు తెలంగాణ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారని, వాహనాలపై ఉన్న పెండింగ్ ఛలాన్లు చెల్లించేందుకు డిస్కౌంట్ ఇచ్చారనే మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వరకు బైక్ ఫైన్లపై 80%, కార్లపై 60% డిస్కౌంట్‌తో చెల్లించాలని మెసేజ్‌లో ఉంది. వాహనదారులు దీనిని నమ్ముతుండటంతో పోలీసులు స్పందించారు. ఈ ప్రకటన ఫేక్ అని, దీనిని నమ్మొద్దని సూచించారు.