News June 14, 2024
వెల్కమ్ చీఫ్: మంచు మనోజ్

జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పలుశాఖలకు మంత్రి కావడంపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ హర్షం వ్యక్తం చేశారు. ‘మెరుగైన సమాజం కోసం మీ నిర్విరామ అంకితభావం, నిబద్ధతకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి. ప్రొడక్టివ్, ఎఫెక్టివ్ పాలన రావాలని కోరుకుంటున్నా. వెల్కమ్ చీఫ్’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 9, 2025
24MP ఫ్రంట్ కెమెరాతో ఐఫోన్18?

ఐఫోన్18 సిరీస్ను 2026 సెప్టెంబర్లో విడుదల చేసేందుకు యాపిల్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. A20 ప్రాసెసర్తో HIAA (హోల్ ఇన్ యాక్టివ్ ఏరియా) టెక్నాలజీని పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ 18, 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్లో డిస్ప్లే కింద 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చనుందని వార్తలొస్తున్నాయి. 2027లో విడుదలయ్యే 18e మోడల్లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫిక్స్ చేసే చాన్స్ ఉంది.
News November 9, 2025
తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బృందం రానట్టేనా?

పంట నష్టంపై అంచనా వేసేందుకు APలో ఈ నెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. 8 మంది అధికారులు 6 జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఆగస్టులో ₹10వేల కోట్లు, ఇటీవలి తుఫానుతో ₹5వేల కోట్లు నష్టపోయినట్లు TG ప్రభుత్వం కూడా కేంద్రానికి నివేదిక పంపింది. కానీ దీనిపై కేంద్రం స్పందించలేదు. కనీసం బృందాన్నీ పంపడం లేదు. దీంతో కేంద్రం మరోసారి తెలంగాణకు మొండిచేయి చూపుతోందని విమర్శలు వస్తున్నాయి.
News November 9, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

✦ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు 35 గంటల్లో 53+ మిలియన్ వ్యూస్
✦ మహేశ్ బాబు-రాజమౌళి సినిమా నుంచి ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసే అవకాశం: సినీ వర్గాలు
✦ రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘దురంధర్’ సినిమా నుంచి మాధవన్ పోస్టర్ విడుదల.. బట్టతలతో గుర్తుపట్టలేని విధంగా లుక్
✦ సుధీర్ బాబు ‘జటాధర’ సినిమాకు 2 రోజుల్లో రూ.2.91కోట్ల కలెక్షన్స్


