News April 19, 2024
స్వాగతం పలుకుతున్న పోలింగ్ స్టేషన్లు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు స్వాగతం పలికేందుకు సిబ్బంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, అందరూ వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని CEC రాజీవ్ కుమార్ కోరారు.
Similar News
News January 14, 2026
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి విషెస్

AP: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్లె సీమలు ఆధునికతను సంతరించుకున్నా మన సంప్రదాయాలను మరచిపోకుండా పాటించాలని కోరుకుంటున్నాను. అందరికీ అనువైన పథకాలతో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు.
News January 14, 2026
సింగర్ మరణం.. మద్యం మత్తులోనే జరిగిందన్న సింగపూర్ పోలీసులు

అస్సాం సింగర్ జుబీన్ గార్గ్ మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని సింగపూర్ పోలీసులు తేల్చినట్లు ఆ దేశ కోర్టు వెల్లడించింది. ‘జుబీన్ మద్యం మత్తులో ఉన్నాడు. వేసుకున్న లైఫ్ జాకెట్ విప్పేశాడు. మళ్లీ ఇస్తే వేసుకోలేదు’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. గతేడాది సెప్టెంబర్లో సింగపూర్ వెళ్లిన జుబీన్ స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోగా, ఆయన్ను హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి.
News January 14, 2026
ఈ గ్రామంలో సంక్రాంతి పండుగే జరపరు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మాములుగా ఉండదు. కానీ, అనంతపురం(D) పి.కొత్తపల్లి గ్రామంలో ఈ పండుగే చేయరు. ఈ మూడ్రోజులు ముగ్గులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులేం చేయరు. విచిత్రమేంటంటే కొందరు స్నానాలు కూడా చేయరట. పూర్వం సంక్రాంతి సరుకుల కోసం సంతకు వెళ్లిన గ్రామస్తులు వరుసగా మరణించడంతో, ఈ పండుగ తమకు అరిష్టమని వారు నమ్ముతారు. అందుకే తరాలు మారినా నేటికీ అక్కడ పండుగ చేసుకోరు.


