News March 18, 2024

వెల్‌కమ్.. ఆర్ఎస్పీ గారూ: కేటీఆర్

image

TG: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్‌లోకి స్వాగతం పలికారు. ‘డాక్టర్ ఆర్ఎస్పీ గారూ బీఆర్ఎస్‌లోకి స్వాగతం. జై తెలంగాణ. జై భీమ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News November 1, 2025

రేపే ఫైనల్: అమ్మాయిలూ అదరగొట్టాలి

image

ఉమెన్స్ ODIWC ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా రేపు 3PMకు భారత్- సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్‌లో AUSను చిత్తు చేసిన జోష్‌లో ఉన్న IND.. ఫైనల్లోనూ గెలిచి తొలి WCను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. స్మృతి, జెమీమా, హర్మన్, రిచా, దీప్తి, చరణి, రాధ, రేణుక ఫామ్ కంటిన్యూ చేస్తే గెలుపు నల్లేరుపై నడకే. SA కెప్టెన్ లారా, నదినె, కాప్‌లతో INDకు ప్రమాదం పొంచి ఉంది.
* ALL THE BEST TEAM INDIA

News November 1, 2025

రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వానలు పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచించింది. కృష్ణా నదికి వరద తాకిడి ఉండటంతో పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News November 1, 2025

కొరియన్ల బ్యూటీ సీక్రెట్ ఇదే..

image

ప్రస్తుతం ఎక్కడ చూసినా కొరియన్ బ్యూటీ ట్రెండ్ వైరల్ అవుతోంది. అయితే కొరియన్లలా కనిపించాలని వారు వాడే ఉత్పత్తులు వాడితే సరిపోదంటున్నారు నిపుణులు. వారి బ్యూటీ సీక్రెట్ ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం. మార్నింగ్ స్కిన్‌కేర్ రిచ్యువల్, ప్రోబయోటిక్స్‌తో నిండి ఉన్న ఆహారాలు, తగిన నిద్ర, నీరు, సన్ స్క్రీన్ వాడటం, ప్రకృతిలో సమయం గడపడం కొరియన్ల అలవాటు. వీటివల్లే వారు అందంగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.