News July 5, 2024
రోహిత్ శర్మకు ‘స్వీట్ హోమ్’ వెల్కమ్

టీ20 వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తన ఇంట్లో స్వీట్ వెల్కమ్ లభించింది. ఇంటి నిండా పూలు చల్లి ఆయనను కుటుంబసభ్యులు ఆహ్వానించారు. రోహిత్‌ను హత్తుకుని తమ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నిన్న ముంబైలో జరిగిన ఓపెన్ టాప్ బస్ పరేడ్ అనంతరం రోహిత్ నేరుగా తన నివాసానికి వెళ్లారు.
Similar News
News April 10, 2026
రష్యాvs ఉక్రెయిన్.. యుద్ధానికి 2 రోజులు బ్రేక్

రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి 2 రోజులు బ్రేక్ పడనుంది. క్రిస్టియన్లకు పవిత్రమైన ఆర్థడాక్స్ ఈస్టర్ సందర్భంగా ఈనెల 11న 4PM గంటల నుంచి 12న అర్ధరాత్రి వరకు కాల్పుల విరమణ పాటించనున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. కాగా ప్రస్తుతం US దృష్టి ఇరాన్ వైపు మళ్లడంతో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఆగిపోయాయి.
News April 10, 2026
13 ఏళ్లలోపు పిల్లలకు SM దూరం.. లోకేశ్ కీలక ఆదేశాలు

APలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచేందుకు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. అలాగే 13-16 ఏళ్ల వారికి వయసును బట్టి కంటెంట్ అందుబాటులో ఉండేలా విధివిధానాలు రూపొందించాలని సూచించారు. SMలో మహిళలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నిన్న రాత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
News April 10, 2026
ఇలాంటి వారికి చేసే సాయం.. వ్యర్థం!

ప్రియములేని విందు పిండివంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్రమెఱుగనీవిబంగారు చేటురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ప్రేమ, ఆప్యాయత లేకుండా పెట్టే విందులో ఎన్ని పిండి వంటలున్నా వ్యర్థమే. భక్తి, శ్రద్ధ లేకుండా చేసే పూజకు వాడే పూలు దండగ. ఇదే తీరున యోగ్యత, అర్హత లేని వారికి చేసే దానం వల్ల ప్రయోజనం ఉండదు.
<<-se>>#PADHYAM<<>>


