News February 26, 2025
36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

TG: 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పగుళ్లు, శ్రీశైలం అగ్నిప్రమాదంపై కారుకూతలు కూసిన మేధావులు SLBC విషయంలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.
Similar News
News February 26, 2025
స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే TNతో పాటు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆ రాష్ట్ర CM స్టాలిన్ వ్యాఖ్యలను KTR సమర్థించారు. దేశానికి అవసరమైనప్పుడు ఈ రాష్ట్రాలే కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయని చెప్పారు. దేశాభివృద్ధిలో వీటి కృషిని గుర్తించకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. దేశానికి ఆర్థిక తోడ్పాటు అందించే రాష్ట్రాల ఆధారంగా పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు.
News February 26, 2025
తమిళనాడులో చరిత్ర తిరగరాస్తాం: విజయ్

వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని సినీ నటుడు, టీవీకే చీఫ్ దళపతి విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడులో ఆయన మాట్లాడారు. 2026 ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామని చెప్పారు. పెత్తందార్లు, భూస్వాములు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచి సామాన్యులకు రాజ్యాధికారం కల్పిస్తామన్నారు. త్వరలోనే పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని తెలిపారు.
News February 26, 2025
‘అమ్మానాన్న క్షమించండి.. యముడు పిలుస్తున్నాడు’

TG: సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. ధర్మారానికి చెందిన రాకేశ్(19) HYDలో చదువుకుంటున్నాడు. 3 రోజుల క్రితం తల్లిదండ్రులకు కాల్ చేసి తనకు చదువు అంటే ఇష్టం లేదని చెప్పాడు. ఇంటికి రమ్మనగా బయలుదేరాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా పోలీసులకు ఫిర్యాదు చేయగా కాచిగూడలో సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ‘అమ్మానాన్న క్షమించండి.. యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. బై.. బై..’ అని లేఖలో పేర్కొన్నాడు.