News October 3, 2024
మూసీ ప్రక్షాళన చేయొద్దని మేం అనడం లేదు: ఈటల

TG: మూసీ ప్రక్షాళన చేయొద్దని తాము అనడం లేదని BJP ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ కంపును కడగమని చెబుతున్నామన్నారు. ఆ నదిలో స్వచ్ఛమైన నీరు పారాలని నల్గొండ ప్రజలు కోరుకుంటున్నారన్న ఈటల ప్రభుత్వం చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. అంతకుముందు మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్మాణాల కూల్చివేతలపై ఈటల చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఖండించారు.
Similar News
News December 10, 2025
పిల్లాడి ఆత్మహత్యతో AUSలో SM అకౌంట్లు క్లోజ్!

ఆస్ట్రేలియాలో నేటి నుంచి <<18509557>>16<<>> ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించలేరు. అయితే దీని వెనుక 14 ఏళ్ల బాలుడు ఆలివర్ ఆత్మహత్య ప్రధాన కారణం. ‘అనోరెక్సియా నెర్వోసా’ అనే డిసీస్తో ఆలివర్.. SM ప్రభావంతో బరువు తగ్గి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావం ఆందోళనకరంగా ఉందని ఆలివర్ తల్లి ప్రధాని ఆంటోనీ అల్బనీస్కి లేఖ రాయడంతో ఈ చట్టం అమలులోకి వచ్చింది.
News December 10, 2025
U19 హెడ్ కోచ్పై క్రికెటర్ల దాడి.. CAPలో కలకలం

పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్(CAP)లో కోచ్పై దాడి జరగడం కలకలం రేపింది. U19 హెడ్ కోచ్ వెంకటరామన్పై ముగ్గురు లోకల్ క్రికెటర్లు బ్యాటుతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు గాయమై 20 కుట్లు పడ్డాయి. SMATకు ఎంపిక చేయకపోవడంతోనే ఈ అటాక్ జరిగినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లోకల్ ప్లేయర్లను కాదని ఫేక్ డాక్యుమెంట్లతో నాన్ లోకల్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్నారని CAPపై ఆరోపణలున్నాయి.
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


