News May 13, 2024
పశ్చిమబెంగాల్ ఫస్ట్.. జమ్మూకశ్మీర్ లాస్ట్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు పార్లమెంటు నియోజకవర్గాల్లో నాలుగో విడత పోలింగ్ జరిగింది. సాయంత్రం 6గంటల వరకు బెంగాల్‌లో అత్యధికంగా 75.66% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్(68.04%), మధ్యప్రదేశ్(68.01%), ఒడిశా(63.85%), ఝార్ఖండ్(63.14%), తెలంగాణ(61.16%), యూపీ(56.35%), బిహార్(54.14%), మహారాష్ట్ర(52.49%) ఉన్నాయి. చివరిస్థానంలో జమ్మూకశ్మీర్(35.75%) నిలిచింది.
Similar News
News March 10, 2026
వాళ్ల ఒత్తిడితోనే వెనక్కి తగ్గిన ట్రంప్?

ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనమైందని ట్రంప్ చెబుతున్నా.. యుద్ధం ముగింపునకు వచ్చిందన్న ప్రకటన వెనక ఆయన అడ్వైజర్ల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ ధరలు పెరగడం, US ప్రజల మద్దతు లేకపోవడం, ఇరాన్ తగ్గే సూచనలు కనిపించకపోవడం, మిడ్ టర్మ్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఎక్కడ డెమోక్రాట్లకు ప్లస్ అవుతుందోనన్న భయం ఉన్నట్లు సమాచారం.
News March 10, 2026
ఎల్ నినో.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: వీసీ

AP: ఈ ఏడాది ఏప్రిల్ వరకు ENSO(ఎల్ నినో+లా నినా) పరిస్థితులకు అవకాశం ఉందని ఎన్జీ రంగా వర్సిటీ వీసీ జయలక్ష్మీ దేవి వెల్లడించారు. జులై తర్వాత <<19250011>>ఎల్ నినోకు<<>> 60 శాతం ఛాన్స్ ఉందని తెలిపారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని సూచించారు. నష్టాలను నివారించడానికి వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలన్నారు.
News March 10, 2026
1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం: ఇజ్రాయెల్

యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 1,900 మంది ఇరాన్ సైనికులు, కమాండర్లను చంపేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌నూ టార్గెట్ చేసే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఇక ఇరాన్, హెజ్బొల్లా దాడుల్లో ఇజ్రాయెల్‌లో 12 మంది పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించినట్లు తెలిపింది. గాయపడిన వారిలో 2,238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని, 91 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.


