News June 22, 2024

వెస్టిండీస్ లక్ష్యం 129 పరుగులు

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో సూపర్ 8 మ్యాచ్‌లో USA జట్టు బ్యాటింగ్‌లో విఫలమైంది. 19.5 ఓవర్లలోనే 128 పరుగులకు ఆలౌటైంది. గౌస్(29), నితీశ్ కుమార్(20) మాత్రమే ఫరవాలేదనిపించారు. వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ 3, ఛేస్ 3, జోసెఫ్ 2, మోతీ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

Similar News

News September 16, 2025

పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

image

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.

News September 16, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.

News September 16, 2025

నానో ఎరువులను ఎప్పుడు పిచికారీ చేయాలి?

image

వరిలో నానో యూరియా, నానో DAPలను కలిపి పిలకలు తొడిగే దశలో, చిరు పొట్ట దశలో పిచికారీ చేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసుల పంటల్లో మొక్కల రెమ్మలు వచ్చే దశ, పూత దశలో స్ప్రే చేసుకోవచ్చు. పండ్ల తోటల్లో మామిడి పూతకు ముందు డిసెంబరు నెలలో నానో DAP స్ప్రే చేయడం వల్ల పూత పెరిగి మంచి దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. కాబట్టి పండ్ల తోటల్లో పూతకు ముందు నానో DAPని పిచికారీ చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.