News September 24, 2024
WGL: అండమాన్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు
ట్రైన్ నంబర్- 16032 అండమాన్ ఎక్స్ ప్రెస్ రైలును నేడు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరంగల్, హసన్‌పర్తి, కాజీపేట ప్రాంతాల మీదుగా వెళ్లే రైలును రద్దు చేస్తున్నందుకు చింతిస్తున్నామని, దీన్ని గమనించాలని సూచించారు. దేవి కత్రా వద్ద రాత్రి 10:25 ప్రారంభం కావాల్సి ఉండగా రద్దు చేశారు.
Similar News
News October 11, 2024
WGL: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
WGL,HNK, JN, BHPL, MHBD, MLG జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News October 11, 2024
వరంగల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
వరంగల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుల్లపల్లి అఖిల్ శుక్రవారం బైకుపై వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్తున్నాడు. డీసీఎం ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News October 11, 2024
కాజీపేట: 100 డాలర్ల నోట్లతో అమ్మవారికి దండ
హనుమకొండ జిల్లా కాజీపేట వెంకటేశ్వర కాలనీలోని రహమత్ నగర్‌లో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దుర్గామాత దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పాక రాజయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 డాలర్ల నోట్లతో అమ్మవారికి హారం రూపంలో దండ వేశారు.