News September 21, 2024

WGL: అండర్-19 జిల్లా జట్టు ఎంపిక

image

ఉమ్మడి వరంగల్ అండర్-19 జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈనెల 22, 23వ తేదీల్లో సికేఎం కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు. 2005 సెప్టెంబర్-1 తరువాత జన్మించిన ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ యూనిఫాం, స్వంత కిట్, ఇతర పత్రాలతో హాజరుకావాలని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ కోరారు.

Similar News

News October 25, 2025

వరంగల్ కలెక్టరేట్‌లో స్పెషల్ గ్రీవెన్స్

image

వరంగల్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజమణి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News October 25, 2025

వరంగల్: గుర్తింపు, హరిత నిధుల ఫీజులు చెల్లించాలి..!

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల కళాశాలలు గుర్తింపు ఫీజుతోపాటు హరితనిధి చెలించాలని డీఐఈవో డా.శ్రీధర్ సుమన్ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్‌లో సంబంధిత కాలేజీ లాగిన్ ద్వారా గుర్తింపు ఫీజు తప్పక చెల్లించాలని సూచించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు రూ.220, హరితనిధి రూ.15 కలిపి మొత్తం రూ.235 చొప్పున చెల్లించాలన్నారు. విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్ చెక్ లిస్టులతో చూడాలన్నారు.

News October 25, 2025

టెన్త్ పరీక్షల ఫీజు నవంబర్ 13లోపు చెల్లించాలి: డీఈవో

image

వరంగల్ జిల్లాలోని పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు ఈనెల 30 నుంచి నవంబర్ 13లోపు చెల్లించాలని డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 15 నుంచి 29 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ ఉన్న సబ్జెక్టులకు రూ.125, వొకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.