News February 11, 2025
WGL: అన్నదాతకు ఊరట.. రూ.100 పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిచ్చాయి. 15 రోజుల అనంతరం నేడు మార్కెట్లో పత్తి ధర రూ.7వేల మార్క్ దాటింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,960 పలకగా.. నేడు రూ.7,060 పలికినట్లు అధికారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.100 పెరగడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 2, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 16 ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<
News November 2, 2025
ప్రతిరోజు తప్పక పఠించాల్సిన 4 మంత్రాలు

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది
News November 2, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.


