News April 13, 2025

WGL: అర్ధరాత్రి దారుణ హత్య..!

image

వరంగల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో బానోతు కొమ్మలును గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి కత్తితో పొడిచి పరారయ్యారని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 22, 2026

నాలుగో మేయర్ కోసం NZB నగరం ఎదురు చూపు

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు మేయర్లు పనిచేశారు. ప్రస్తుతం నాలుగో మేయర్ కోసం నగరం ఎదురు చూస్తోంది. మొదటి మేయర్‌గా కాంగ్రెస్ నుంచి ధర్మపురి సంజయ్, రెండో మేయర్‌గా ఆకుల సుజాత (BRS), మూడో మేయర్‌గా దండు నీతూ కిరణ్ (BRS) పని చేయగా నాలుగో మేయర్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ నాలుగో వ్యక్తి ఎవరో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

News January 22, 2026

గాజువాక జీవీఎంసీ సమావేశంలో కుప్పకూలిన ఇంజినీర్

image

జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ ఉండగా ఇంజినీరింగ్ విభాగం సెక్షన్ ఇంజినీర్ గోవింద్ రాజు కుప్ప కూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తోటి ఉద్యోగులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 22, 2026

DGEMEలో ఉద్యోగాలు

image

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్(DGEME) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.indianarmy.nic.in/