News April 13, 2025
WGL: అర్ధరాత్రి దారుణ హత్య..!

వరంగల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో బానోతు కొమ్మలును గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి కత్తితో పొడిచి పరారయ్యారని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 20, 2025
ఎన్టీఆర్: LLB పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.
News April 20, 2025
DSC: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 26, ➱HINDI: 28, ➱ENG: 55, ➱MATHS: 59, ➱PS: 39, ➱BS: 58, ➱SOCIAL: 91, ➱PE:139, ➱SGT: 239, ➱TOTAL: 734 ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱TEL: 07, ➱HINDI: 11, ➱MATHS:07, ➱PS: 35, ➱SOCIAL:05, ➱SGT: 335, ➱TOTAL:400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News April 20, 2025
తండ్రి మందలించాడని..

పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే విద్యార్థిని తండ్రి మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని జగరాజుపల్లి ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వరలక్ష్మి శనివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఇది తెలిసిన తండ్రి వెంకటేశ్ కూతురిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.