News March 10, 2025
WGL: ఆర్జీలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను పరిశీలించి, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి ఆమె స్వయంగా అర్జీలను స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News March 11, 2025
వరంగల్: సాగునీటి నిర్వహణ సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్ష

హైదరాబాద్ సచివాలయం నుంచి సాగునీటి నిర్వహణ సరఫరాపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు వరంగల్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నీటిపారుదల వ్యవసాయ విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 10, 2025
నర్సంపేట: అన్ని తామై.. అనాథ యువతుల పెళ్లిళ్లకు ఏర్పాట్లు

నర్సంపేటలోని సంజీవని అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి ఆశ్రయం పొందిన రోజా, నాగరాణి అనే ఇద్దరు అనాథ యువతులకు ఈనెల 12న వివాహాలు జరగనున్నాయి. ఆ పెళ్లితంతులో భాగంగా సోమవారం అదే ఆశ్రమంలో ఇద్దరు యువతులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళల నడుమ మంగళస్నానాలు చేయించారు. ఏ లోటు లేకుండా పెళ్లిళ్లు జరపాలనే సేవాగుణాన్ని చాటుకోవడం పట్ల ఆశ్రమ నిర్వాహకుడు డా.మోహనరావును ఐసీడీఎస్ సీడీపీవో మధురిమ అభినందించారు.
News March 10, 2025
WGL: ప్రభుత్వ రాయతీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాలని లేఅవుట్, నాన్ లేఅవుట్ ఫ్లాట్లు, యజమానులు డెవలపర్లు ఫ్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ తెలిపారు. కూడా కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులతో ఎల్ఆర్ఎస్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు. నిబంధనల మేరకు అనుమతులు ఇస్తామన్నారు.