News March 24, 2025
WGL: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్టే.ఘనపూర్లో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News September 18, 2025
HYD: ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి: కమిషనర్

HYD సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (H-CITY) స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్(SNDP) పనులను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పెండింగ్ పనులపై ఇంజినీర్లు ఫోకస్ పెట్టాలని సూచించారు.
News September 18, 2025
HYD: నీటి నాణ్యత పరీక్షలపై జలమండలి ఫోకస్

జీహెచ్ఎంసీ నుంచి ORR వ్యాప్తంగా నల్లా నీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక నజర్ పెట్టింది. ఇందులో భాగంగానే క్లోరినేషన్ ప్రక్రియ, పంపింగ్, డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిని పరిశీలిస్తోంది. అనేకచోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్లోరిన్ బిల్లల సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసింది. నెలకు లక్షకుపైగా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
News September 18, 2025
వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్దే నిర్ణయం: అచ్చెన్నాయుడు

AP: యూరియాతో సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. YCP నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కుంటిసాకులతో సభకు రావట్లేదని, వైసీపీ MLAల అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతిపక్ష నేతగానూ జగన్ పనికిరారని జనం పక్కనపెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగటం మాని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.