News March 24, 2025
WGL: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్టే.ఘనపూర్‌లో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 21, 2025
నిర్మల్‌లో వడదెబ్బతో ఇద్దరు మృతి

వడదెబ్బతో ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం నిర్మల్ పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కురన్నపేట్ కాలనీకి చెందిన శంకర్(48), రాజు (42) ఆదివారం పోచమ్మ పండుగ ఉండటంతో డప్పు కొట్టడానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చాక నీరసంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందారు. మృతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని.. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News April 21, 2025
బాపట్ల: బాధితులకు న్యాయం చేస్తాం- ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం చేస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని చట్ట పరంగా విచారించి చర్యలు చేపడతామన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News April 21, 2025
రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. రాజ్‌ను విచారించేందుకు సిట్ ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈక్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణను న్యాయస్థానం వచ్చేవారానికి వాయిదా వేసింది.