News March 24, 2025

WGL: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందా..? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? స్టే.ఘనపూర్‌లో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 17, 2025

చెన్నారావుపేట: సెల్యూట్.. జయరాజ్ పోలీస్ అన్న!

image

చెన్నారావుపేట మండలం బోజేరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పని తీరుకు ప్రజలు సెల్యూట్ పోలీస్ అన్న అని మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ పండు ముసలావిడ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఆమెను తన భుజాలపై పోలింగ్ కేంద్రంలోకి మోసుకు వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.

News December 17, 2025

వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..!

image

జిల్లా వ్యాప్తంగా మూడో విడత సర్పంచి ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా నమోదైంది. నర్సంపేట మండలంలో 57.62 శాతం, ఖానాపురం మండలంలో 44.88 శాతం పోలింగ్ జరిగింది. చెన్నారావుపేట మండలంలో 64.86 శాతం, నెక్కొండ మండలంలో 63.3 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుండగా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

News December 17, 2025

ఎంజీఎం వార్డులోకి కుక్క.. ఇద్దరికి షోకాజ్ నోటీసులు

image

వరంగల్ MGM ఆసుపత్రిలో మరోసారి భద్రతా లోపాలు బయటపడ్డాయి. గతంలో ఎలుకలు కొరికిన ఘటన జరిగిన అదే వార్డులోకి తాజాగా ఒక కుక్క ప్రవేశించడం కలకలం రేపింది. రోగి బంధువులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతో విధుల్లోని ఇద్దరు సిబ్బందికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల వైఫల్యానికి తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.