News February 25, 2026
WGL: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 96% మంది హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు వరంగల్ జిల్లాలో 96 శాతం విద్యార్థులు హాజరుకాగా, హనుమకొండ జిల్లాలో 97 శాతం విద్యార్థులు హాజరయ్యారు. వరంగల్‌లో 6,447 మందికి గాను 6,185 మంది విద్యార్థులు హాజరయ్యారు. హనుమకొండలో 19,638 మందికి 19,099 మంది హాజరయ్యారు. రెండు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 76 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DIEOలు శ్రీధర్ సుమన్, గోపాల్ తెలిపారు.
Similar News
News April 18, 2026
సభకు నేనొచ్చా.. వాళ్లు రాలేదు: రాఘవ్ చడ్ఢా

రాజ్యసభకు గైర్హాజరైన సొంత పార్టీ నేతలపై ఎంపీ రాఘవ్ చడ్ఢా విమర్శలు చేశారు. ‘మా పార్టీ సభా పక్షనేత ఇక్కడ లేరు. కొత్తగా నియమితులైన డిప్యూటీ లీడర్ కూడా రాలేదు. నన్ను డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఇటీవల తొలగించారు. నేను సభకు వచ్చాను. మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులైన హరివంశ్ సింగ్‌కు అభినందనలు తెలిపారు.
News April 18, 2026
సంజామల @44.8°C

నంద్యాల జిల్లా సంజామలలో శుక్రవారం రికార్డు స్థాయిలో 44.8°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు వేడిగాలి చెవుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా జాగ్రత్తలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
News April 18, 2026
ద్విచక్ర వాహనాలు ఢీ.. పదో తరగతి విద్యార్థి మృతి

టేక్మాల్ (M) ఎల్లంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సండ్రు సదానందం (16) మృతి చెందగా, శెట్టి గోపాల్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ వేర్వేరు బైక్‌లపై వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే సదానందం ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడు ఇటీవలనే SSC పరీక్షలు రాశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


