News November 6, 2024

WGL: ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు షెడ్యూలు జారీ

image

ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన తేదీలను, ఫీజుల మొత్తం వివరాలను ఇంటర్ బోర్డు జారీ చేసిందని డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ బోర్డు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 25 తేదీలోగా ఫీజులు చెల్లించవచ్చని అన్నారు.

Similar News

News November 6, 2024

జనగామ: గుండెపోటుతో రైతు మృతి

image

జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన బక్కయ్య(52) అనే రైతు మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బక్కయ్య ఆకస్మిక మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2024

వరంగల్ నిట్‌లో లైబ్రరీ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

image

WGLలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) ఒప్పంద ప్రాదిపదికన లైబ్రరీ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ తెలిపారు. అభ్యర్థులు ఎంఎల్ఐఎస్సీలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. నెలకు రూ.20వేల వేతనం, అభ్యర్థుల వయసు 28సం.లు మించొద్దన్నారు.

News November 5, 2024

రాహుల్ గాంధీని కలిసిన మంత్రి కొండా సురేఖ

image

హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లతో కలిసి మంత్రి కొండా సురేఖ కలిశారు. అనంతరం పలు అంశాలపై రాహుల్ గాంధీ, నేతలతో మంత్రి కొండా సురేఖ చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్సి, తదితరులు ఉన్నారు.