News February 26, 2025
WGL: ఈనెల 27న డయల్ యువర్ డీఎం కార్యక్రమం

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్-1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 27న ఉ.9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు, సలహాలు, సూచనలు తెలపాలని కోరారు.
Similar News
News December 13, 2025
హెచ్పీవీని జాతీయ టీకాల జాబితాలో చేర్చాలి: విశాఖ సీపీ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్‌ను జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో చేర్చాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైతన్య స్రవంతి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు, హోంగార్డుల కుమార్తెలకు (9-14 ఏళ్లు) ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు త్వరలో బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
News December 13, 2025
నిర్మల్: పోలింగ్ సిబ్బందితో మాటామంతీ

నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి శనివారం పలు సూచనలు చేశారు. స్థానిక మినీ ఎన్టీఆర్ స్టేడియంలో పోలింగ్ సామగ్రి తీసుకొని బస్సుల్లో బయలుదేరుతున్న సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలన్నారు.
News December 13, 2025
మంగళగిరి: సీఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 16న కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సభా ఏర్పాట్లను హోంమంత్రి అనిత.. డీఐజీ ఏసుబాబు, ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేశ్ బాబులతో కలిసి పరిశీలించారు. అభ్యర్థులు వారి కుటుంబాలతో కలిసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.


