News March 10, 2025
WGL: ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ

వరంగల్ జిల్లాలోని పలు చోట్ల నేడు పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే నెక్కొండ మండలంలో ఈరోజు తెల్లవారుజామున పొలం పనులకు, స్కూళ్లకు, అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. అలాగే మధ్యాహ్నం సమయంలో భానుడు సైతం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఎండ దంచి కొడుతుందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో విచిత్ర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.
Similar News
News January 11, 2026
ప.గో: పందెపు బరుల ఏర్పాటు.. బౌన్సర్లతో భద్రత!

సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో కోడిపందాల బరుల ఏర్పాటు వేగవంతమైంది. పొలాలు, లేఅవుట్లను చదును చేసి, ప్రేక్షకుల కోసం భారీ గ్యాలరీలు, అతిథుల కోసం ప్రత్యేక విడిది సౌకర్యాలను నిర్మిస్తున్నారు. పందేల వద్ద గొడవలు జరగకుండా ముందస్తుగా ప్రైవేట్ బౌన్సర్లను సైతం నియమిస్తున్నారు. పండుగకు ముందే పందెం రాయుళ్ల హడావుడితో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయి.
News January 11, 2026
వేములవాడ: ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతి అదనపు ఛార్జీలు

సంక్రాంతి పండుగ పేరిట ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ సమయంలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వేములవాడకు డీలక్స్ బస్సు టికెట్ రూ.250 ఉండగా, పండుగ స్పెషల్ పేరిట నిర్వహిస్తున్న బస్సుల్లో రూ.350 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.
News January 11, 2026
శ్రీగిరిపై రేపటి నుంచి సంక్రాంత్రి బ్రహ్మోత్సవాలు

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రతిరోజూ స్వామి, అమ్మవార్లకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉభయ దేవాలయాల్లో నిర్వహించే పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.


