News March 10, 2025
WGL: ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ

వరంగల్ జిల్లాలోని పలు చోట్ల నేడు పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే నెక్కొండ మండలంలో ఈరోజు తెల్లవారుజామున పొలం పనులకు, స్కూళ్లకు, అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. అలాగే మధ్యాహ్నం సమయంలో భానుడు సైతం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఎండ దంచి కొడుతుందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో విచిత్ర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.
Similar News
News March 15, 2025
సంగారెడ్డి: ‘పరీక్షకు 239 మంది విద్యార్థులు గైర్హాజరు’

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.13,987 మంది విద్యార్థులకు గాను 13,748 మంది విద్యార్థులు హాజరయ్యారని, 239 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
News March 15, 2025
భీమవరంలో యువతి ఆత్మహత్యాయత్నం

భీమవరం డీఎన్ఆర్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చిన్న వంతెన మీద నుంచి మురికి కాలవలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు, శ్రీనివాస్ అనే యువకుడు ఆ యువతిని రక్షించారు. యువతికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమస్య ఏంటి అని అడగ్గా తమ తల్లిదండ్రులు విడిపోతున్నారని బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపింది.
News March 15, 2025
రాజమండ్రి: 23 నుంచి సీపీఐ రాజకీయ ప్రచార జాత

రాజ్యాంగ పరిరక్షణ, సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయమే లక్ష్యంగా మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు సీపీఐ రాజకీయ ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. రాజమండ్రిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల చరిత్రను నాటకాల ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.