News April 30, 2024
WGL: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి

MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. వరంగల్లో 48 నామినేషన్లు ఆమోదించగా.. ఆరుగురు విత్డ్రా చేసుకొన్నారు. 42 మంది బరిలో నిలిచారు. మహబూబాబాద్ లోక్సభలో ఇద్దరు విత్ డ్రా చేసుకోగా.. 23 మంది బరిలో ఉన్నారు. SHARE IT
Similar News
News October 25, 2025
వరంగల్ కలెక్టరేట్లో స్పెషల్ గ్రీవెన్స్

వరంగల్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజమణి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News October 25, 2025
వరంగల్: గుర్తింపు, హరిత నిధుల ఫీజులు చెల్లించాలి..!

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల కళాశాలలు గుర్తింపు ఫీజుతోపాటు హరితనిధి చెలించాలని డీఐఈవో డా.శ్రీధర్ సుమన్ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో సంబంధిత కాలేజీ లాగిన్ ద్వారా గుర్తింపు ఫీజు తప్పక చెల్లించాలని సూచించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు రూ.220, హరితనిధి రూ.15 కలిపి మొత్తం రూ.235 చొప్పున చెల్లించాలన్నారు. విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్లైన్ చెక్ లిస్టులతో చూడాలన్నారు.
News October 25, 2025
టెన్త్ పరీక్షల ఫీజు నవంబర్ 13లోపు చెల్లించాలి: డీఈవో

వరంగల్ జిల్లాలోని పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు ఈనెల 30 నుంచి నవంబర్ 13లోపు చెల్లించాలని డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 15 నుంచి 29 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ ఉన్న సబ్జెక్టులకు రూ.125, వొకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.


