News February 15, 2025
WGL: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్, సంగంరెడ్డి సుందర్ రాజ్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News September 17, 2025
ఆసియా కప్: గంట సమయం కోరిన పాక్!

అవసరమైతే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామన్న పాక్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గంట పొడిగించాలని పీసీబీ కోరినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా హోటల్ నుంచి బయల్దేరని ఆటగాళ్లు చేరుకునేందుకే అడిగి ఉండొచ్చని సమాచారం. కాగా భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, లేదంటే మిగతా మ్యాచులు ఆడమని PCB ప్రకటించింది. కానీ ఈ డిమాండ్‌ను ICC తిరస్కరించింది.
News September 17, 2025
IFSCAలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(<
News September 17, 2025
అనకాపల్లి: ‘8ఏళ్ల తర్వాత దొరికిన నిందితుడు’

కొత్తకోట, రావికమతం పోలీస్ స్టేషన్లలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన 4కేసుల్లో నిందితుడు 8ఏళ్ల తర్వాత చిక్కాడని సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. కాకినాడకు చెందిన కొరపాకల కుమారస్వామి (33)పై 2017లో కేసు నమోదు కాగా ఆనాటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లోని భవానినగర్ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న అతనిని తమ సిబ్బంది అరెస్టు చేయగా రిమాండ్‌కు తరలించామన్నారు.