News February 15, 2025
WGL: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్, సంగంరెడ్డి సుందర్ రాజ్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News October 22, 2025
ఇంటర్ విద్యార్థులకు డీఐఈఓ ముఖ్య సూచనలు

2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు అంబేడ్కర్ కోనసీమ డీఐఈఓ సోమశేఖరరావు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. హాల్ టికెట్లోని పొరపాట్లను డీఐఈఓ ద్వారా సవరించుకోవాలన్నారు. సమాధానాలకు 24 పేజీల పుస్తకం మాత్రమే ఇస్తారని, ఫలితాలు వచ్చాక నెల తర్వాతే ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
News October 22, 2025
కామారెడ్డి: ఇళ్ల నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో ఇంటి నిర్మాణ దశలను పరిశీలించి, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లేదా పరిపాలనా ఇబ్బందులు వెంటనే తెలపాలని, నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News October 22, 2025
చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేసి చట్టవిరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంస్థలకు వచ్చిన నిధులు, ఖర్చులు, మౌలిక వసతుల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నియంత్రణపై చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.