News February 25, 2025

WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Similar News

News January 8, 2026

తుని: ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

image

పూరి-తిరుపతి(17479) ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. తుని–హంసవరం మధ్య రైలు ప్రయాణిస్తుండగా B-5 బోగీలోని విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న దుప్పట్లకు నిప్పు అంటుకోవడంతో అప్రమత్తమైన ప్రయాణికులు కాలిపోతున్న దుప్పట్లను బయటకు విసిరేయడంతో ముప్పు తప్పింది. అనంతరం రాజమహేంద్రవరం స్టేషన్‌లో రైలును నిలిపివేసి సాంకేతిక నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు.

News January 8, 2026

అర్ధవీడులో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్

image

సంక్రాంతి, రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఈనెల 10న అర్ధవీడులో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.25,000, రెండో బహుమతి రూ.15,000 మూడో బహుమతి రూ.8000లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

News January 8, 2026

KU: డబుల్ పీజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్లు రద్దు

image

డబుల్ పీజీ చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ హాస్టల్స్ అడ్మిషన్లకు అర్హులు కాదని కేయూ హాస్టల్స్ డైరెక్టర్ ఎల్సీ రాజ్‌కుమార్ బుధవారం స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి హాస్టల్‌లో చేరిన విద్యార్థులు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అడ్మిషన్ రద్దు చేసుకోవాలని సూచించారు. గడువు దాటితే హాస్టల్ అడ్మిషన్ రద్దుతో పాటు డిపాజిట్ మనీ తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.