News January 8, 2025

WGL: ఓ వైపు చైనా మాంజా.. మరో వైపు చైనా వైరస్!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ వైపు చైనా మాంజా.. మరోవైపు చైనా వైరస్‌‌తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల <<15024024>>జనగామలో చైనా మాంజా<<>>తో నలుగురు గాయపడ్డారు. దీంతో రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు భయపడుతున్నారు. అంతేగాక ఇప్పటికే చైనా వైరస్ hMPV ప్రభావంతో జిల్లాలో పలువురు మాస్కులు ధరిస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు.

Similar News

News December 8, 2025

వరంగల్: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

జీ.పీఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మొదటి విడత 3వ, రెండవ విడత 2వ ర్యాండమైజేషన్‌ను జిల్లా సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, కలెక్టర్ డా.సత్య శారద సమక్షంలో పూర్తిచేశారు. రెండు విడతల్లో కలిపి 4,543 మంది పి.ఓ., ఓ.పీ.ఓలను పారదర్శకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.

News December 8, 2025

పోలింగ్ రోజున వరంగల్‌లో స్థానిక సెలవులు: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించినట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.

News December 8, 2025

వ్యవసాయ శాఖపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

image

వరంగల్ కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖపై కలెక్టర్ డా.సత్య శారద సమీక్ష నిర్వహించారు. యాసంగి 2025-26కి అవసరమైన విత్తనాలు, ఎరువులు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు 12,719 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలంలో యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.