News July 12, 2024

WGL: కళా తోరణానికి పుష్ప సోయగం

image

జనగామ జిల్లా ముఖద్వారం పెంబర్తి శివారు ఏకశిలా కళా తోరణం వద్ద ఉన్న జాతీయ రహదారుల విభాగిని ముఖ్య కూడళ్లలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన పూలమొక్కలు ఆకట్టుకుంటున్నాయి. రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికుల మనసును దోచేలా ఉన్న పూల మొక్కలు, రంగు రంగుల పుష్పసోయగంతో తోరణం కొత్త అందాలను సంతరించుకుంది.

Similar News

News February 26, 2026

ఏనుమాముల మార్కెట్‌లో ఉద్యోగుల బదిలీ

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను
అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్‌ను ఎనుమాముల మార్కెట్ లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు. ఈ అంతర్గత బదిలీలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

News February 26, 2026

సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం: కలెక్టర్

image

కాకతీయ కెనాల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెనాల్ పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి సౌకర్యం మెరుగుపడితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.

News February 26, 2026

వరంగల్: వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ

image

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎస్‌కె సేవాసమాజ్ ప్రాంతంలో బుధవారం దొంగతనం జరిగింది. బాధితురాలు దాస విజయ వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు పుస్తెలతాడు, సెల్‌ఫోన్, రూ.2,500 నగదు ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.99,500 ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.