News March 13, 2025
WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం మక్కలు (బిల్టి) క్వింటాకు రూ.2,310 ధర పలకగా.. బుధవారం రూ.2,305కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.10 తగ్గి రూ.2,300కి పడిపోయింది. అలాగే సూక పల్లికాయ క్వింటాకి రూ.7,150 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News March 15, 2025
ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పులు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎర్రుపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మొలుగుమాడుకి చెందిన తోట వెంకటేశ్వరరావు అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంతో పాటు మరో 5ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశాడు. పంట సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 15, 2025
నేడు తణుకులో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తణుకులో పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్’లో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉ.7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 8.05కు తణుకు చేరుకుంటారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పార్టీ శ్రేణులు, అధికారులతో సమావేశమై 12.55 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
News March 15, 2025
స్టాలిన్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న స్టాలిన్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఈడీ సోదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంపై విమర్శలకు దిగిందని అన్నారు. బడ్జెట్ పత్రాల్లో రూపీ(₹) చిహ్నం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ సంస్థలను ఉల్లంఘించడమేనని ఫైరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారన్నారు.