News March 26, 2025
WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మక్కలు (బిల్టి) క్వింటాకి సోమవారం రూ. 2265 పలకగా.. మంగళవారం రూ.2,250 పలికింది. బుధవారం మరింత తగ్గి రూ.2245కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయ క్వింటాకు రూ.6050 ధర రాగా.. పచ్చి పల్లికాయకి రూ.4300 ధర వచ్చింది.
Similar News
News April 2, 2025
రాజంపేట: రెవెన్యూ అధికారులకు శిక్షణ తరగతులు

రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీ ఆడిటోరియంలో కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో బుధవారం రాజంపేట రెవెన్యూ అధికారులకు వివిధ చట్టాలపై 2వ ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రీ సర్వే ప్రగతి, మంజూరైన పొసెషన్ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ పురోగతి, హౌస్ సైట్స్ రీవెరిఫికేషన్ పురోగతి, పెండింగ్లో ఉన్న భూమి అన్యాక్రాంతం, భూ సేకరణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
News April 2, 2025
కరీంనగర్: కలెక్టరేట్లో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
News April 2, 2025
యూపీఏ హయాంలోనూ సవరణలు జరిగాయి: రిజిజు

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. అందులో ప్రతిపాదించిన సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. చట్టంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించొద్దన్నారు. యూపీఏ హయాంలోనూ ఈ చట్టంలో సవరణలు జరిగాయన్నారు. అది మిగతా చట్టాలపై ప్రభావం చూపిందని, అందుకే మళ్లీ సవరించాల్సి వస్తోందన్నారు.