News April 10, 2025
WGL: క్రమంగా పెరుగుతున్న పత్తి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,405 పలకగా.. మంగళవారం రూ.7,355, బుధవారం రూ.7,400 పలికాయి. అలాగే నేడు (గురువారం) మరింత పెరిగి రూ.7,425కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్‌కు పత్తి తరలిరాగా క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News November 22, 2025
WGL: జైలు భూమి తాకట్టు.. రుణం మళ్లింపుపై విజిలెన్స్ కసరత్తు

WGL సెంట్రల్ జైలు భూమిని తాకట్టు పెట్టి TG SSHCL రూ.117 కోట్ల రుణం తీసుకున్నా, అది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కాకుండా ఇతర ఖర్చులకు మళ్లించినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. జీవో 31తో బదిలీ చేసిన 56 ఎకరాల భూమి తాకట్టు విధానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టి విచారణకు ఆదేశించారు. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయ్యగా, విజిలెన్స్ నివేదిక అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు.
News November 22, 2025
WGL: మార్చిలోపు ఆస్పత్రి పూర్తికి లక్ష్యం!

WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మార్చిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వం పెంచిన రూ.1,725.95 కోట్ల అంచనా వ్యయాన్ని ఆడిట్ తర్వాత రూ.1,558 కోట్లకు తగ్గించారు. సివిల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పారిశుధ్య పనులకు రూ.1,158 కోట్లు కేటాయించగా, మొత్తం 85% పనులు పూర్తయ్యాయి. ఎక్విప్మెంట్ ఇన్‌స్టాలేషన్ జరుగుతోంది. నిధుల సమస్య లేకుండా మార్చిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు?
News November 22, 2025
కృష్ణా: చోరీ అనుమానితుల ఫొటోలు విడుదల..!

మచిలీపట్నం మాచవరం సమీపంలోని పాత తౌడు ఫ్యాక్టరీ వద్ద రెండు రోజుల కిందట రెండు ఇళ్లలోకి చోరీకి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ 8332983789కు సమాచారం ఇవ్వాలని చిలకలపూడి సీఐ కోరారు. వీరిద్దరూ బైక్‌పై తిరుగుతుంటారని తెలిపారు.


