News April 10, 2025

WGL: క్రమంగా పెరుగుతున్న పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,405 పలకగా.. మంగళవారం రూ.7,355, బుధవారం రూ.7,400 పలికాయి. అలాగే నేడు (గురువారం) మరింత పెరిగి రూ.7,425కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్‌కు పత్తి తరలిరాగా క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Similar News

News April 14, 2026

హాలియా: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

అనుముల మండల కేంద్రమైన హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

News April 14, 2026

విశాఖ జూలో సింహం మృతి

image

విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్‌లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది.ఈ వ్యాధుల ప్రభావంతో అవయవాలు పనిచేయకపోవడంతో సింహం మృతి చెందినట్లు జూ క్యూరేటర్ తెలిపారు.

News April 14, 2026

సీఎం రేవంత్ రెడ్డితో జగిత్యాల నేతలు భేటీ

image

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ తదితరులు హాజరయ్యారు. పెద్ద నాయకులు పార్టీ వీడినా తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.