News April 7, 2025
WGL: క్వింటా పసుపు ధర రూ.12,126

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పలు చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాల్ ధర రూ.6,500, పచ్చి పల్లికాయ రూ.4,200 పలికింది. అలాగే పసుపు క్వింటాల్ ధర రూ.12,126, మక్కలు(బిల్టీ) క్వింటాల్ ధర రూ.2,280 పలికినట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News April 19, 2025
కలెక్టర్& SPలతో సమావేశమైన మంత్రి భరత్

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి టీజీ భరత్‌ను జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ జగదీశ్ శుక్రవారం కలిశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి భరత్ గంటపాటు సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగుందని మంత్రి కొనియాడారు.
News April 19, 2025
కామారెడ్డి: ఏపీ మంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం హైదరాబాద్‌లోని హాజ్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హజ్ యాత్రకు వెళ్లే ఇరు రాష్ట్రాల యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఇరువురు చర్చించారు. అంతకుముందు మంత్రిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శాలువా కప్పి సత్కరించారు.
News April 19, 2025
కామారెడ్డి: కఠిన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయి: SP

నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు పడినప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని KMR జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన కోర్టు డ్యూటీ పోలీసు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. వారెంట్లు, సమన్లు వేగంగా ఎగ్జిక్యూట్ చేసి ట్రయల్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.