News March 24, 2025
WGL: గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ చేసిన ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 4న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని గిరిజన భవన్లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా సూచించారు. ఆసక్తి గల వారు తమ బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.
Similar News
News November 12, 2025
భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఇటలీ జంట

భారతీయ సంప్రదాయంపై నమ్మకంతో ఇటలీ నుంచి వచ్చిన జంట కాశీలో వివాహం చేసుకున్నారు. పెళ్లి కూతురు యాంటీలియా, పెళ్లి కొడుకు గ్లోరియస్ సనాతన సంప్రదాయం ప్రకారం నవదుర్గ ఆలయంలో ఒక్కటయ్యారు. ఆచార్య మనోజ్ మంత్రాలు చదువుతుండగా ఈ జంట దండలు మార్చుకుని, బొట్టు పెట్టుకుని, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచింది. ఏడాది క్రితం వీరు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నపట్పికీ ఇప్పుడు భారతీయ సంప్రదాయంలో వివాహమాడటం గమనార్హం.
News November 12, 2025
విజయవాడ: రోగులు ఫుల్.. సిబ్బంది నిల్..!

విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగలకు కలిపి 85 మంజూరు పోస్టులు ఉండగా కేవలం 36 మంది మాత్రమే ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి రోగులు అనేక మంది వస్తున్నారని, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అపాయింట్మెంట్ తీసుకొని మరి వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న బాధితులు వస్తున్నారని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు.
News November 12, 2025
HYD: రాష్ట్రంలో కాంగ్రెస్కి ఢోకా లేదు: TPCC

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్చాట్లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.


