News September 5, 2024
WGL: గురువులు జీవితాన్ని ఇస్తారు: ఎంపీ కావ్య
తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్నిస్తారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకల్లో ఎంపీ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. చదువు చెప్పే వారు మాత్రమే గురువులు కాదని, సన్మార్గంలో నడిపించే ప్రతి ఒక్కరూ గురువులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News September 19, 2024
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,850
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. నేడు కొంత పెరిగి రూ. 7850 అయిందని వ్యాపారులు తెలిపారు. పత్తి ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు. .
News September 19, 2024
KU: 26 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు
KU పరిధిలో డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలన్నారు.
News September 19, 2024
వరద ప్రభావిత పరిస్థితులపై మంత్రి సీతక్క సమీక్ష
మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత పరిస్థితులు, చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను జిల్లాలో వరదల చర్యలపై పలు వివరాలను సీతక్క అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.