News January 27, 2025
WGL: గోల్డ్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు

జనవరి 23 నుంచి 26 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సాయి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన అనంత్ బజాజ్ మెమోరియల్ తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్- 2025లో సామల శ్రీ చేతన్ శౌర్య గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్, కోచ్ మాడిశెట్టి శ్రీధర్ అభినందించారు.
Similar News
News February 12, 2025
గాజా పాలస్తీనీయులదే.. ఖాళీ చేయకూడదు: చైనా

గాజా నుంచి పాలస్తీనీయుల్ని ఖాళీ చేయించి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ‘గాజా అనేది పాలస్తీనీయులకు మాత్రమే చెందినది. అది వారి భూభాగం. అక్కడి నుంచి పాలస్తీనీయుల్ని బలవంతంగా ఖాళీ చేయించే ఆలోచనను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొంది. అటు అరబ్ లీగ్ కూడా అమెరికా ఆలోచనను తప్పుబట్టింది. అరబ్ ప్రపంచం దాన్ని ఆమోదించబోదని తేల్చిచెప్పింది.
News February 12, 2025
‘కింగ్డమ్’ టీజర్‌పై రష్మిక స్పెషల్ పోస్ట్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘కింగ్డమ్’ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది. దీనిపై VD ఫ్రెండ్, హీరోయిన్ రష్మిక మందన్న స్పందిస్తూ ఇన్‌స్టాలో స్పెషల్ పోస్ట్ చేశారు. ‘ఇతడు ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తాడు. విజయ్ నిన్ను చూసి నేను గర్విస్తున్నా’ అని రష్మిక పేర్కొన్నారు. విజయ్ కొత్త సినిమా టీజర్ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి.
News February 12, 2025
అనంత: ‘బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన బాలుడు.. వివరాలు తెలిస్తే చెప్పండి’

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ కొండ మీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో ఓ బాలుడు తప్పిపోయాడు. కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే బుక్కరాయసముద్రం సీఐకి సమాచారం అందించాలని తెలిపారు.