News May 19, 2024
WGL: గ్రూప్1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి: TSPSC ఛైర్మన్

జూన్ 9న జరగనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీపీలు, ఎస్పీ, డీసీపీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
Similar News
News February 25, 2026
వరంగల్: రాయితీలపై పనిముట్లు అందజేత

ఉద్యాన రైతులకు సబ్సిడీలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కూరగాయ విత్తన కిట్లు 100% సబ్సిడీతో పాటు మినీ ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, మామిడి ఫ్రూట్ కవర్లు, మల్చింగ్ షీట్లు, ప్లాస్టిక్ క్రేట్లు, లూజ్ షేడ్‌నెట్‌లపై 40–50% రాయితీ అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించాలి.

News February 24, 2026
వరంగల్ జిల్లాలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జిల్లాలో నిర్వహించబోయే ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ పరీక్షా ఏర్పాట్ల వివరాలను తెలిపారు.