News May 19, 2024
WGL: గ్రూప్1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి: TSPSC ఛైర్మన్
జూన్ 9న జరగనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీపీలు, ఎస్పీ, డీసీపీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
Similar News
News December 13, 2024
గ్రూప్-II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: WGL సీపీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ జిల్లా పరిధిలో రేపు డిసెంబర్ 15 నుంచి 16 వరకు జరిగే TGPSC గ్రూప్-II నిర్వహించే పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీ నిషేధమని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఓ ప్రకటనలో తెలిపారు.
News December 13, 2024
వరంగల్ కాకతీయ జూ-పార్కుపై ప్రత్యేక దృష్ట
కాకతీయ జూ-పార్కు మధ్య గుండా పోతున్న వరదనీటి డ్రైనేజీ కారణంగా దుర్వాసన వస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, డ్రైనేజీని జూ-పార్కు బయటకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అదేశించారు. రివ్యూ మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ జూ పార్కుతో పాటు ఇతర జూ పార్కుల్లో ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
News December 13, 2024
నదీ పుష్కరాలపై మంత్రి కొండా సమీక్ష
మంత్రి కొండా సురేఖ సారథ్యంలో ‘సరస్వతీ నది పుష్కరాల’పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పుష్కరాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.