News August 22, 2024
WGL: జిల్లా వ్యవసాయాధికారుల బదిలీ

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్న సాధారణ బదిలీల్లో భాగంగా కొందరికి స్థాన చలనం జరిగింది. సుమారు 20 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న జేడీఏ ఉషను ఆదిలాబాద్‌కు, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధను వరంగల్ జిల్లాకు బదిలీ చేశారు. నరేశ్ కుమార్‌ను ములుగు జిల్లాకు ఏడీఏగా బదిలీ చేశారు.
Similar News
News September 16, 2025
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు సార్వత్రిక ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ డా.సత్యశారద కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు ఉన్నారు.
News September 15, 2025
ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఏంతంటే?

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,555 ధర పలకగా.. నేడు(సోమవారం) రూ.7,400కి తగ్గింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
News September 14, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ ధర కిలోకి రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతున్నది. అలాగే స్కిన్లెస్ కేజీకి రూ.250- 260 ధర, లైవ్ కోడి రూ.140- 150 ధర ఉన్నది. సిటీ తో పోలిస్తే పల్లెల్లో వీటి ద్వారా రూ.10-20 తేడా ఉంది. కాగా గతవారంతో పోలిస్తే నేడు ధరలు స్వల్పంగా పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.