News January 8, 2025
WGL: తరలివచ్చిన పల్లికాయ, పసుపు.. ధర ఎంతంటే?

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు నేడు పసుపు, పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు నిన్న రూ.6,500 ధర పలకగా.. నేడు రూ.6,610కి పెరిగింది. అలాగే పచ్చి పల్లికాయకు మంగళవారం రూ.4,860 ధర రాగా.. నేడు రూ.4,750కి పడిపోయింది. అలాగే క్వింటా పసుపుకి రూ.11,609 ధర వచ్చిందని అధికారులు తెలిపారు.
Similar News
News November 9, 2025
HNK: జాబ్ మేళాలో 214 మందికి ఉద్యోగాలు

హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళ నిర్వహించారు. ఇందులో 214 మందికి ఉద్యోగాలు పొందారని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి వెల్లడించారు. జాబ్ మేళాకు 1200 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా 600 పైచిలుకు హాజరయ్యారన్నారు. 24 సంస్థలు వివిధ రంగాల్లో 214 మంది విద్యార్థులకు అపాయింటుమెంట్ పత్రాలు అందజేశారని తెలిపారు.
News November 9, 2025
పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించండి: టీఐయూఎఫ్

ఉపాధ్యాయుల పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఐయూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వరంగల్లోని కృష్ణ కాలనీ పాఠశాలలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ టీచర్స్ బెనిఫిట్స్ చెల్లించాలని, సర్దుబాటును పారదర్శకంగా నిర్వహించాలని, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరారు.
News November 9, 2025
పర్వతగిరి: కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు కలెక్టర్ సూచనలు..!

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ సత్య శారద సూచనలు చేశారు. ప్రతి రైతు ధాన్యాన్ని 100% ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేసుకుంటేనే మిల్లువారు ఎలాంటి కటింగ్ లేకుండా 41kgకి అంగీకరిస్తారన్నారు. మిల్లులో అన్ లోడింగ్ ఐన మరుక్షణమే OPMS పూర్తి చేసి, 24గంటల్లో రైతుఖాతాలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని నేల మీద కాకుండా కవర్ల మీదే పోయాలని, ప్రతి కుప్ప చుట్టూ చిన్న కందకం చేయాన్నారు.


