News March 12, 2025

WGL: తరలివచ్చిన మొక్కజొన్న.. ధరల్లో స్వల్ప తేడా!

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి ఈరోజు మొక్కజొన్న తరలి వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అయితే, ధర మాత్రం రైతులకు నిరాశ కలిగించింది. మక్కలు(బిల్టీ) ధరలు గత మూడు రోజుల నుంచి ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటాకు రూ.2,305 ధర పలకగా.. మంగళవారం రూ.2,310కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.2,305కి పడిపోయింది. ఈరోజు సైతం మార్కెట్‌కి పసుపు రాలేదు.

Similar News

News December 4, 2025

సల్మాన్ ఖాన్ రాక.. కీరవాణి రాగం

image

TG గ్లోబల్ సమ్మిట్‌కు సినీ గ్లామర్ తోడవనుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సదస్సుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. సినీ ఇండస్ట్రీపై చర్చలో ఆయన పాల్గొంటారు. అటు ఈవెంట్ మొదట్లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి కన్సర్ట్ ఉండనుంది. సుమారు గంటన్నరపాటు ఆయన తన సంగీతంతో ఆకట్టుకోనున్నారు. బంజారా, కోలాటం, గుస్సాడీ, భారతనాట్యం వంటి కల్చరల్ ప్రోగ్రామ్‌లు అతిథులను అలరించనున్నాయి.

News December 4, 2025

HYD: కేటీఆర్ పర్యటనలో కెమెరామెన్ మృతి

image

కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. విడియో తీస్తుండగా గుండె నొప్పితో ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ కుప్పకూలారు. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందారు. మృతదేహం గాంధీ మార్చరికి తరలించారు.