News March 12, 2025

WGL: తరలివచ్చిన మొక్కజొన్న.. ధరల్లో స్వల్ప తేడా!

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి ఈరోజు మొక్కజొన్న తరలి వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అయితే, ధర మాత్రం రైతులకు నిరాశ కలిగించింది. మక్కలు(బిల్టీ) ధరలు గత మూడు రోజుల నుంచి ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటాకు రూ.2,305 ధర పలకగా.. మంగళవారం రూ.2,310కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.2,305కి పడిపోయింది. ఈరోజు సైతం మార్కెట్‌కి పసుపు రాలేదు.

Similar News

News March 27, 2025

మోహన్ లాల్ ‘L2:ఎంపురాన్’ మూవీ రివ్యూ

image

లూసిఫర్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ‘L2:ఎంపురాన్’ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో PKR వారసుడిగా సీఎం పదవి చేపట్టిన జితిన్‌ చేసే అవినీతిని హీరో ఎలా అడ్డుకున్నాడనేది స్టోరీ. మోహన్ లాల్, టొవినో థామస్, పృథ్వీరాజ్ మెప్పించారు. సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ బాగున్నాయి. బలహీనమైన స్టోరీ, ఎమోషన్ సీన్లు లేకపోవడం, నిడివి, స్లోగా ఉండటం మైనస్.
WAY2NEWS RATING: 2.5/5.

News March 27, 2025

పోక్సో కేసు నిందితులపై రౌడీ షీట్: హోంమంత్రి అనిత

image

AP: రాష్ట్రంలో పోక్సో కేసు నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 CC కెమెరాలను ప్రారంభించిన అనంతరం హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 27, 2025

భారత్‌కు పుతిన్: పర్యటనను ఖరారు చేసిన రష్యా

image

ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనను రష్యా ఖరారు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన త్వరలోనే ఇక్కడికి వస్తారని తెలిపింది. ‘భారత్‌లో పుతిన్ పర్యటనకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు’ అని రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్‌రోవ్ ప్రకటించారు. టైమ్‌లైన్‌ను మాత్రం వెల్లడించలేదు. మోదీ మూడోసారి అధికారంలోకి రాగానే రష్యాకే వెళ్లిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!