News March 25, 2025
WGL: తరలి వచ్చిన పత్తి.. ధర ఎంతంటే?

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులకు ధరల విషయంలో ఈరోజు స్వల్ప ఊరట లభించినట్టయింది. నిన్న (సోమవారం) క్వింటా పత్తి ధర రూ.7,030 పలకగా.. నేడు రూ.7045 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్కు భారీగా పత్తి తరలి రాగా.. కొనుగోళ్ల ప్రక్రియ సైతం జోరుగా కొనసాగుతోంది.
Similar News
News November 22, 2025
‘పీస్ ప్లాన్’ నాకూ అందింది: పుతిన్

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు US ప్రతిపాదించిన <<18346240>>పీస్ ప్లాన్<<>>ను స్వాగతిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. తుది పరిష్కారానికి ఇది ఆధారమవుతుందని చెప్పారు. పీస్ ప్లాన్ తనకూ అందిందని, ఇంకా చర్చించలేదని పేర్కొన్నారు. తమను ఓడించాలని ఉక్రెయిన్, దాని యూరప్ మిత్రపక్షాలు ఇంకా కలలు కంటున్నాయని మండిపడ్డారు. కాగా పీస్ ప్లాన్లో రష్యా అనుకూల డిమాండ్లు ఉండటంతో ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది.
News November 22, 2025
రాముడికి సోదరి ఉందా?

దశరథుడికి, కౌసల్యా దేవికి రాముడు జన్మించక ముందే శాంత అనే పుత్రిక పుట్టినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం.. కౌసల్య సోదరి వర్షిణి, అంగ దేశపు రాజైన రోమపాద దంపతులకు శాంతను దత్తత ఇచ్చారు. ఈమె అంగ దేశపు యువరాణిగా పెరిగారు. లోక కార్యం కోసం ఆమె గొప్ప తపస్వి అయిన శృంగ మహర్షిని వివాహం చేసుకున్నారు. ఆ మహర్షే అయోధ్యలో పుత్ర కామేష్టి యాగం నిర్వహించి రామలక్ష్మణుల జననానికి కారణమయ్యారు.
News November 22, 2025
కూలుతున్న ‘క్రిప్టో’.. భారీగా పతనం

ఆకాశమే హద్దుగా ఎగిసిన క్రిప్టోకరెన్సీ అంతే వేగంగా దిగివస్తోంది. కొన్నాళ్లుగా వాటి విలువలు పడిపోతున్నాయి. క్రిప్టో రారాజు బిట్ కాయిన్ వాల్యూ ఈ నెలలో 25 శాతం పతనం కావడం గమనార్హం. 2022 జూన్ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఈ నెల మొదట్లో 1.10 లక్షల డాలర్లుగా ఉన్న విలువ నిన్న 7.6 శాతం తగ్గి 80,553 డాలర్లకు చేరింది. మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల కంటే కిందికి పడిపోయింది.


