News July 15, 2024

WGL: దరఖాస్తుల్లో తప్పులు.. వినియోగదారుల అవస్థలు!

image

గృహజ్యోతి పథకం వర్తించక ఉమ్మడి WGL జిల్లా వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో వివరాలను తప్పుగా నమోదు చేయడమే దీనికి కారణమని, కరెంట్ బిల్ కట్టాల్సి వస్తుందని మండిపడుతున్నారు. గతేడాది DEC నుంచి ఈ ఏడాది జనవరి 6 వరకు జిల్లా వ్యాప్తంగా 11,89,692 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల తప్పులను సరిదిద్దడానికి MPDO, పురపాలక ఆపీస్‌లకు వెళ్లాలని MHBD విద్యుత్‌శాఖ SE నరేశ్ తెలిపారు.

Similar News

News October 6, 2024

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: వరంగల్ కలెక్టర్

image

వచ్చే సోమవారం అక్టోబర్ 7న కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారదా తెలిపారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని, కలెక్టర్ తెలిపారు.

News October 5, 2024

దాండియా వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దాండియా వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని దాండియా ఆడారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాకు, ఆచారాలు, కట్టుబాట్లను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం కాసేపు మహిళలతో మాజీ మంత్రి మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

News October 5, 2024

WGL: సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా

image

సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ‘ఎకో టూరిజం’పై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎకో టూరిజం అభివృద్ధిపై కాసేపు అధికారులతో మంత్రి చర్చించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రీయాల్, తదితరులు ఉన్నారు.