News October 30, 2024
WGL: నర్సంపేట మార్కెట్‌కు 4రోజులు సెలవులు

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరసగా 4 రోజులు సెలవులు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 31(గురువారం) దీపావళి, 1(శుక్రవారం) అమావాస్య, 2(శనివారం), 3(ఆదివారం) తేదీల్లో వ్యాపారుల విజ్ఞప్తి మేరకు సెలవులు ప్రకటించారు. తిరిగి 4న మార్కెట్ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.
Similar News
News November 27, 2025
వరంగల్: ఏడాది గడిచినా వేతనాలు అందని దుస్థితి!

ఇంటింటి కుటుంబ సర్వే పూర్తై ఏడాది గడిచినా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు వేతనాలు అందక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో 1.79 లక్షల కుటుంబాలపై 1200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్వైజర్లు పనిచేశారు. ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రతి దరఖాస్తుకు రూ.30 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినా చెల్లింపులు నిలిచిపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
వరంగల్: సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం నిఘా!

ఎన్నికల పారదర్శకత కోసం వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. 5వేల పైబడిన గ్రామాల్లో సర్పంచ్ ఖర్చు రూ.2.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ.50 వేలుగా, 5వేల లోపులో సర్పంచ్‌కు రూ.1.5 లక్షలు, వార్డులకు రూ.30 వేలుగా పరిమితులు నిర్ణయించారు. మండల కేంద్రాల్లో క్లస్టర్లు ఏర్పాటై, అభ్యర్థులు సంబంధిత పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చని చెప్పారు.
News November 27, 2025
WGL: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: ఎస్‌ఈసీ

రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి పాల్గొన్నారు.


