News February 20, 2025
WGL: నిజనిద్దారణకు ఎంక్వయిరీ కమిటీ: కలెక్టర్

నర్సంపేట అసిస్టెంట్ లేబర్ అధికారిపై ఫిర్యాదు నేపథ్యంలో ఎంక్వయిరీ కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో లేబర్ అధికారి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘానికి చెందిన సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిజాలను నిగ్గు తేల్చడానికి 10 రోజుల్లో విచారణ నిర్వహించిన నివేదిక అందజేయాలన్నారు.
Similar News
News October 31, 2025
5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.
News October 31, 2025
రూ.1,032 కోట్ల బకాయిలు, బిల్లులు విడుదల

TG: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R&B శాఖల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.1,032 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా Dy.CM భట్టి క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా OCT నెలకు సంబంధించి ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు, పంచాయతీరాజ్ R&Bకి రూ.320 కోట్లు విడుదల చేశారు. దీంతో రూ.10లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ కానున్నాయి.
News October 31, 2025
హనుమకొండ: నిర్లక్ష్యమే ముంచిందా..?

HNKలోని సమ్మయ్యనగర్, గాంధీనగర్, అమరావతినగర్ ప్రాంతాల్లో వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.100 కోట్లతో నిర్మించిన డక్ట్ గేట్లు ముందే తెరవకపోవడం ముంపుకు కారణమైందని బాధితులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల ముందే వినతిపత్రం ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, కమిషనర్, మేయర్ పర్యటించగా ప్రజలు ఫైర్ అయ్యారు. నిర్లక్ష్యమే ముంచిందా అంటూ నగరంలో చర్చగా మారింది.


